Bigg Boss 5 : ఇక వెక్కిరింత‌ల‌కు ఫుల్‌ స్టాప్.. ఈ వారం హౌజ్‌నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌నుంది ఎవ‌రో తెలుసా ?

November 20, 2021 5:02 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే ప‌ది మంది ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ.. హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక ఆ తర్వాత అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుంచి పదవ వారంలో బయటకు వచ్చాడు.

Bigg Boss 5  who whill be eliminated from house this week

11వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. నాగిని డ్యాన్స్‌లు చేస్తూ, వెక్కిరిస్తూ, గ‌ట్టిగ‌ట్టిగా అరుస్తూ నానా ర‌చ్చ చేసే అనీ మాస్ట‌ర్.. ఈ వారం హౌజ్ నుండి బ‌య‌ట‌కు రానుంద‌ని అంటున్నారు. బిగ్‌బాస్ నుంచి 11వ వారం అనీ మాస్టర్‌ ఎలిమినేట్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

ఆమె ఇంటి నుంచి వెళ్లడానికి అంతా సిద్దమైందనే వార్తలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ అనీ మాస్టర్ ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే టాప్ 5లో చేరడానికి అవకాశాలు భారీగా ఏర్పడుతాయనే వాదన వినిపిస్తోంది.

ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్‌గా ఉన్న రవి మినహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే అందరిలోనూ కాజల్, అనీ, సిరిలు మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉండగా.. సిరి సేవ్ అయ్యిందట. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న కాజల్, అనీలలో కాజల్‌కు అనీతో పోల్చితే ఎక్కువ ఓట్లు రావడంతో కాజల్ సేవ్ అయ్యిందని.. దీంతో ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. రేపు నాగార్జున ప్ర‌క‌టించే వ‌ర‌కు ఎలిమినేష‌న్ అనేది కాస్త స‌స్పెన్సే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment