Poonam Kaur : ఈటెలను కలిసిన నటి పూనమ్ కౌర్.. ధర్మమే గెలుస్తుందంటూ.. షాకింగ్ కామెంట్స్..!

November 20, 2021 2:16 PM

Poonam Kaur : సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రతి విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Poonam Kaur met etela rajender and said comments on his win

తాజాగా హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్‌ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ ఎన్నికలో గెలుపోటములపై స్పందించిన పూనమ్ తాజాగా ఈటెల రాజేందర్‌ను కలిశారు. అలాగే తెలుపు రంగు దుస్తులను ధరించి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు.

గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన కానుకను సమర్పించడమే కాకుండా ధర్మ యుద్ధమే గెలుస్తుంది.. అంటూ రాజేందర్‌ గెలుపుపై స్పందించారు. ఇలా ఈమె రాజేందర్‌ను కలవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పూనమ్ బీజేపీలో చేరనుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే బీజేపీతో స్నేహం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే పూనమ్‌ కౌర్‌ ఈటెలను కలవడం ఆసక్తికరంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now