Naga Chaitanya : చైతూ వెబ్ సిరీస్ లో సందడి చేయనున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

November 20, 2021 7:44 PM

Naga Chaitanya : నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి సినిమాలపై ఎంతో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ జెట్ స్పీడులో సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇక నాగచైతన్య లవ్ స్టోరీ సక్సెస్ అందుకున్న తరువాత వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Naga Chaitanya web series tamil actress reportedly got offer

ఇదిలా ఉండగా విక్రమ్ కె కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒక హార్రర్ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగెటివ్ పాత్రలో సందడి చేయనున్నాడు. ఇక ఈ సిరీస్ లో నాగచైతన్య సరసన ఎవరు నటిస్తున్నారు.. అనే విషయం గురించి ఇన్ని రోజులూ సందేహాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ విషయంపై ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ హార్రర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య సరసన నటించడానికి తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. తొలిసారిగా నాగచైతన్యతో కలిసి తెలుగు ప్రేక్షకులను సందడి చేయబోతున్న ఈమె ఏ విధమైన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment