Rashmika Mandanna : ర‌ష్మిక‌కు న‌చ్చిన వంట‌కాలు మీరు తినే ఛాన్స్.. మిస్ చేసుకోకండి..!

November 20, 2021 2:23 PM

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక ప్ర‌స్తుతం ఫలు భాష‌లలో సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చాక ర‌ష్మిక డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది. పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డి ర‌చ్చ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోయింది ర‌ష్మిక‌. ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

Rashmika Mandanna  shared her favorite food items list

ప్రస్తుతం ర‌ష్మిక‌.. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమా చేస్తోంది. ఒక వైపున తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన దూకుడును కొనసాగిస్తూనే మరో వైపున తమిళ .. హిందీ భాషల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అయితే ర‌ష్మిక‌కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ‘ది రష్మిక మీల్’ పేరుతో ప్రత్యేక మీల్ కేటగిరిని రూపొందించింది. రష్మిక ఇష్టపడే ఐటమ్స్ తో కూడిన మీల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

‘ది రష్మిక మీల్’ ప్యాకేజ్ లో మెక్ స్పైసీ .. ఫ్రైడ్ చికెన్ .. మెక్ స్పైసీ చికెన్ బర్గర్ .. పెరి పెరి ఫ్రైస్ .. నింబూ ఫిజ్ .. మెక్ ఫ్లర్రి ఉంటాయి. ఫుడ్ విషయంలో రష్మిక ఎక్కువగా ఏం ఇష్టపడుతుందో తెలుసుకోవాలనే అభిమానులకు ఇప్పుడు ఆ జాబితా ఏమిటో తెలిసిపోయింది.

ఇక వాటి టేస్ట్‌ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చునన్నమాట. దీనిపై రష్మిక మాట్లాడుతూ .. “జీవితంలో పెద్ద .. చిన్న సక్సెస్ లను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నా మెక్ డొనాల్డ్స్ ఫేవరేట్స్ ను అందరితో కలిసి పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment