Bigg Boss 5 : ప‌ది వారాల త‌ర్వాత మాన‌స్‌కు కెప్టెన్ అవ‌కాశం.. బాధ‌లో స‌న్నీ..

November 18, 2021 10:58 PM

Bigg Boss 5 : బిగ్ బాస్‌లో ప్ర‌తి ఏడాది కొన్ని గ్రూపులు ఏర్ప‌డ‌డం స‌హజం. గ్రూపులుగా ఆడి కొద్ది మంది గెలిచారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో జెస్సీ, సిరి, ష‌ణ్ముఖ్ ఓ గ్యాంగ్ కాగా, ఇందులో జ‌స్వంత్ బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో ర‌వి ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కాజ‌ల్‌, మాన‌స్‌, సన్నీ ఓ గ్రూప్‌గా ఏర్ప‌డి గేమ్ ఆడుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో రోజురోజుకీ లెక్క‌లు మారిపోతున్నాయి.

Bigg Boss 5 manas became captain for the house

శనివారం సన్నీది బ్యాడ్ బిహేవియ‌ర్ అని రవి కామెంట్ చేశాడు. దీనిని స‌న్నీ ఏ మాత్రం తీసుకోలేక‌పోతున్నాడు. ఛాన్స్ వ‌స్తే ర‌వితో గొడ‌వ‌కు దిగుతున్నాడు స‌న్నీ. అయితే ర‌వి త‌న‌కు వ‌చ్చిన ప‌వర్‌ను స‌న్నీకి త్యాగం చేయ‌డానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు. కానీ స‌న్నీ మాత్రం అత‌డిస్తానంటున్న ప‌వ‌ర్‌ను తీసుకోవ‌డానికి రెడీగా లేన‌ని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అత‌డికి న‌చ్చ‌జెప్పేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించ‌గా అయిష్టంగానే స‌న్నీ ఓకే చెప్పాడు.

రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్‌తోపాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కెప్టెన్ అయ్యే అవ‌కాశాన్ని మాన‌స్ అందుకున్నాడ‌ని లీకు వీరుల ద్వారా తెలుస్తోంది.

ప‌ది వారాల త‌ర్వాత మాన‌స్ కెప్టెన్ అయినందుకు ఆయ‌న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాన‌స్ కెప్టెన్ అయితే స‌న్నీ రేష‌న్ మేనేజ‌ర్ అవుతాడేమోన‌ని ఊహిస్తున్నారు. అయితే గ‌త శనివారం నుండి స‌న్నీపై అంద‌రూ దాడికి దిగుతుండడం అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment