జర్నలిస్టుల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఏర్పాటుచేసిన.. తెలంగాణ ప్రభుత్వం!

May 1, 2021 5:03 PM

ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో జర్నలిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ని ఏర్పాటు చేసింది. ఎంతో మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో కరోనా బారినపడి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.

ఈ సమావేశంలో భాగంగా జర్నలిస్టులకు కోవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది. ఈ మేరకు శనివారం నుంచి జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా వివరాలను అందిస్తే వారికి వెంటనే వైద్య పరీక్షలు, మందులు సరఫరా, బెడ్లు మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వైద్య అధికారులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment