Samantha : పుష్ప టీమ్‌కు కండిష‌న్లు పెడుతున్న స‌మంత ?

November 17, 2021 10:24 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ మూవీలు చేసేందుకు ఒప్పుకుంది కానీ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఈ గ్యాప్‌లోనే ఆమె మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది.

Samantha putting conditions for pushpa team

సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న పుష్ప మూవీలో ఓ ఐట‌మ్ సాంగ్ చేసేందుకు స‌మంత అంగీక‌రించింది. దీంతో గ‌తంలో ఏ టాప్ హీరోయిన్‌కు ద‌క్క‌నంత రెమ్యున‌రేష‌న్ ను స‌మంత‌కు ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఏకంగా రూ.1.50 కోట్ల వ‌ర‌కు స‌మంత‌కు ఈ సాంగ్ కోసం పారితోషికం ఇస్తున్నార‌ట‌. దీంతో ఈ సాంగ్‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

అయితే విడాకుల త‌రువాత మొద‌టి సారిగా స‌మంత కెమెరా ముందుకు వ‌స్తుండ‌డంతో ఆమె అనేక ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటోంది. ముఖ్యంగా సాంగ్ షూటింగ్‌ను సిటీ మ‌ధ్య‌లో ఉన్న స్టూడియోల్లో కాకుండా రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ చేయాల‌ని నిర్మాత‌ల‌ను కోరింద‌ట‌. దీంతో మీడియా కంట ప‌డ‌కుండా, ఎలాంటి స‌మ‌స్య రాకుండా సాఫీగా షూటింగ్‌కు వెళ్లి రావ‌చ్చ‌ని స‌మంత ఆలోచ‌న‌.

ఇక ఈ సాంగ్‌కు గాను స‌మంత 5 కాల్‌షీట్లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వాటిని అడ్జ‌స్ట్ చేసి సాంగ్ చిత్రీక‌ర‌ణను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. కేవ‌లం ఐట‌మ్ సాంగ్ ఒక్క‌టి షూటింగ్ పెండింగ్‌లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment