Sreemukhi : తనకు కాబోయే వాడి గురించి.. అసలు నిజం బయటపెట్టిన శ్రీముఖి..!

November 17, 2021 3:58 PM

Sreemukhi : బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా తన మాటలతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన హవా ఏంటో నిరూపించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కాబోయే వాడి గురించి అసలు నిజం బయట పెట్టింది.

Sreemukhi told who she wants to marry

తొలిసారిగా అదుర్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వెండితెరపై పలు సినిమాలలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటోంది.

ఇదిలా ఉండగా తాజాగా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సర్కార్‌ అనే గేమ్ షోలో శ్రీముఖి పాల్గొన్నది. అందులో ప్రదీప్ శ్రీముఖిని నీకు ఎలాంటి అబ్బాయి కావాలని ప్రశ్నించగా.. వెంటనే శ్రీముఖి మంచి జాబ్ చేసే వ్యక్తి కావాలని, అంతే కాకుండా బాగా డబ్బులు, అందం ఉండాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.

కాగా శ్రీముఖి ఇటీవల తన సోదరుడితో కలిసి ఓ కొత్త కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అలాగే అవినాష్‌ పెళ్లిలోనూ సందడి చేసింది. ఆ తరువాత అతను, ఇంకొందరు స్నేహితులతో కలిసి పబ్‌లో రచ్చ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now