Ram Charan Tej : వామ్మో రామ్ చరణ్ హెయిర్ స్టైల్‌ ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

November 17, 2021 7:57 PM

Ram Charan Tej : ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ పారితోషికం విషయంలో ఎంతగా డిమాండ్ చేస్తూ ఉంటారో తమ కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ఇక స్టార్ హీరోలు సినిమాలలోని పాత్రలకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ లు చేసుకుంటుంటారు. అందుకు గాను రూ.లక్షల్లో ఖర్చులు చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ హెయిర్ స్టైల్‌కు చెందిన ఖర్చు వివరాల వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది.

Ram Charan Tej hair stylist cost you will be surprised

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ముంబై నుంచి హెయిర్ స్టయిలిస్ట్‌ వస్తున్నారట.

వీరికి రోజుకు లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్, రాకపోకలకు క్లాస్ టికెట్స్.. అంతేకాకుండా ముగ్గురు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. మొత్తానికి హెయిర్ స్టయిలిస్ట్‌ ల కోసం కూడా భారీ ఖర్చులు చేస్తున్నారంటే ఈ సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వామ్మో.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now