Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని ఫిర్యాదు..!

November 13, 2021 12:46 PM

Hardik Pandya : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్యాపై ఓ మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. పాండ్యాతోపాటు ఇంకొంద‌రు ప్లేయ‌ర్లు, ఓ బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడిపై కూడా ఆమె ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ను వారందరూ లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని, త‌న‌పై అత్యాచారం చేశార‌ని ఆమె ఆరోపించింది. ఈ మేర‌కు ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసింది.

a woman complained on Hardik Pandya about harassment

అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. హార్ధిక్ పాండ్యాతోపాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్‌ కొఠారీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలు తనను లైంగిక వేధింపులకు గురి చేశార‌ని, త‌న‌పై అత్యాచారం చేశార‌ని చెప్పింది. అయితే ఇదంతా త‌న భ‌ర్త వ‌ల్లే జ‌రిగింద‌ని తెలియ‌జేసింది.

త‌న‌ను త‌న భ‌ర్త రియాజ్ త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఆ విధంగా పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌ర‌కు పంపేవాడ‌ని తెలిపింది. అయితే ఈ విష‌యంపై సెప్టెంబ‌ర్‌లోనే ముంబైలోని సాంతా క్రూజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ప‌ట్టించుకోలేద‌ని, ఇక‌నైనా త‌న‌కు న్యాయం చేయాల‌ని తెలిపింది. కాగా రెహ్నుమా ఇచ్చినా ఫిర్యాదులో చిరునామా స‌రిగ్గా లేక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌ను క‌లిగిస్తోంది. ఈ క్ర‌మంలోనే పోలీసులు దీనిపై స్పందిస్తూ కేసు విచారిస్తున్న‌ట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now