Bigg Boss 5 : చిన్న పిల్లాడిలా అనీ మాస్ట‌ర్ వీపెక్కిన స‌న్నీ.. ష‌ణ్ముఖ్‌ని ఓ ఆటాడుకుంటున్న సిరి..

November 13, 2021 9:34 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ర‌స‌వత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ జ‌రుగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కు దీనిని ముగించాడు బిగ్ బాస్ . అయితే షో మొద‌ట్లో ర‌వి తాను కాజ‌ల్ ద‌గ్గ‌ర తీసుకున్నడబ్బు తిరిగి ఇచ్చేశాడు. దీంతో కాజల్.. నువ్వేనా నొక్కేసింది.. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందా.. అని సందేహం వ్యక్తం చేసింది. దీంతో రవి.. సీక్రెట్ టాస్క్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వను కదా మేడమ్ అని అన్నాడు.

Bigg Boss 5 sunny played with ani master

షణ్ముఖ్‌ పాట పాడుతూ తన వెనుక తిరగాలని ఆర్డర్ వేసింది సిరి. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే అని పాడ పాడటంతో సిరి వయ్యారాలు ఒలకబోస్తూ స్టైల్‌గా నడిచింది. ఆమె ఓవ‌రాక్ష‌న్ చూసి ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కిపోయింది. ఇక సన్నీ అయితే ఏకంగా అనీ మాస్టర్ గుర్రం ఎక్కాడు. ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం.. అంటూ సన్నీని గుర్రం ఎక్కించుకుని తెగ తిప్పేసింది అనీ మాస్టర్. ఈ ఘోరం చూసి అంద‌రూ తిట్టుకుంటున్నారు.

ఇక షణ్ముఖ్ అయితే కాజల్‌పై ఫన్నీ కవిత చెప్పి తెగ నవ్వించాడు.. అదిగో అదిగో గోడ.. ఇదిగో ఇదిగో నీడ.. నీడలో ఉంది దూడ.. దూడ వేసింది పేడ.. పేడతో చేశాం పిడక.. పిడకతో వేశాం మంట.. మంటతో చేశాం వంట.. అంటూ కాజల్‌పై కవిత అందుకున్నాడు షణ్ముఖ్. నీ కవిత కొత్తగా కాదు చెత్తగా ఉందంటూ గాలి తీసేసింది కాజల్. రవి మాత్రం దూరం నుంచి చూస్తే చందమామ.. దక్కరకెళ్లి చూస్తే మన కాజల్ మామ.. అంటూ ఆమెను బుట్టలో పెట్టి వంద పట్టేశాడు.

షణ్ముఖ్‌ ప్రెస్టీజ్‌ చాంపియన్‌ ఆఫ్‌ ది వీక్‌గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్‌ వోచర్‌ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌. అతిథుల టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్‌ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్‌, పింకీలపై వేటు వేశారు. దీంతో సిరి, కాజల్‌, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి ‘టవర్‌లో ఉంది పవర్‌’ అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో పోటీదారులు టవర్‌ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి. హౌజ్‌మేట్స్ మ‌ద్ద‌తుతో ర‌వి కెప్టెన్‌గా గెలిచాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment