Drishyam 2 : దృశ్యం 2 మూవీ కూడా.. అమెజాన్‌లోనే..?

November 12, 2021 12:37 PM

Drishyam 2 : వెంక‌టేష్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో అప్ప‌ట్లో వ‌చ్చిన దృశ్యం మూవీ ఎంత హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. మ‌ళ‌యాళ సినిమా రీమేక్ అయిన‌ప్ప‌టికీ దృశ్యంను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇక ఈ మూవీకి మ‌ళ‌యాళంలో దృశ్యం 2ను తీశారు. దాన్ని తెలుగులోనూ మ‌ళ్లీ వెంక‌టేష్ రీమేక్ చేశారు.

Drishyam 2 may be streamed on amazon prime

రీమేక్‌లోనూ అదే తారాగ‌ణం న‌టించారు. అయితే ఈ మూవీని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. కానీ సురేష్ బాబు ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ తో సంప్ర‌దింపులు జ‌రిపారు. కానీ డీల్ కుద‌ర‌లేద‌ని తెలిసింది. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. దృశ్యం 2 మూవీని అమెజాన్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే దృశ్యం 2 మూవీ అమెజాన్‌లో ప్ర‌సార‌మవుతుంద‌ని స‌మాచారం.

ఇక ఈ మూవీలో వెంక‌టేష్ స‌ర‌స‌న మీనా న‌టించ‌గా.. న‌దియా, ఎస్తెర్ అనిల్‌, న‌రేష్‌లు కూడా మ‌ళ్లీ రిట‌ర్న్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా విడుద‌ల ఆల‌స్యం అయింది. అయితే ఎట్ట‌కేల‌కు ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంద‌ని తెలుస్తోంది. ఇక వెంక‌టేష్ న‌టించిన నార‌ప్ప కూడా ఓటీటీలో స్ట్రీమ్ కాగా.. ఆయ‌న రెండో చిత్రం దృశ్యం 2 కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

ఇక వెంక‌టేష్ న‌టిస్తున్న ఎఫ్3 ప్ర‌స్తుతం షూటింగ్ ను జ‌రుపుకుంటోంది. ఈ మూవీని వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment