Adivi Sesh : ర‌వితేజ‌తో ఫైట్ చేయ‌నున్న అడివి శేష్..!

November 12, 2021 9:36 AM

Adivi Sesh : అడివి శేష్ హీరోగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం.. మేజ‌ర్‌. ఇప్పటికే ప‌లు సినిమాల్లో హీరోగా అడివి శేష్ న‌టించి మెప్పించారు. దీంతో మ‌రోసారి మేజ‌ర్ సినిమా రూపంలో అడివి శేష్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు, మ‌రోమారు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Adivi Sesh to fight with ravi teja at box office

అయితే అడివి శేష్ మేజ‌ర్ మూవీని ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన వాలెంటైన్స్ వీక్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. కానీ అదే రోజు ర‌వితేజ న‌టించిన ఖిలాడీ మూవీని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ర‌వితేజ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద అడివి శేష్ ఫైట్ చేయ‌నున్నాడు.

అయితే మేజ‌ర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల అవుతుంది క‌నుక టాలీవుడ్ ఇండ‌స్ట్రీ బ‌య‌ట ఆ మూవీకి అడ్వాంటేజ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ర‌వితేజ మూవీ అవుట్ అండ్ అవుట్ మ‌సాలా ఫిలిం, మేజ‌ర్ మూవీ భిన్నంగా ఉంటుంది. క‌నుక రెండింటికీ పోటీ పెట్ట‌లేమ‌ని కూడా అంటున్నారు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ వ‌ద్ద న‌డిచే సినిమానే నంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తుంది. మ‌రి రెండు మూవీల్లో ఏది హిట్ సాధిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment