Anchor Vishnu Priya : అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి జ‌రిగిపోతుంది.. యాంక‌ర్ విష్ణు ప్రియ పోస్ట్‌..!

November 11, 2021 11:01 PM

Anchor Vishnu Priya : బుల్లి తెర‌పై స‌క్సెస్ సాధించిన యాంక‌ర్ల‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఇప్పుడు పెద్ద‌గా షోస్ చేయ‌డం లేదు కానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదిక‌గా ప‌లు బ్రాండ్ల‌ను కూడా ఈమె ప్ర‌మోట్ చేస్తోంది.

Anchor Vishnu Priya said by that time her marriage will happen

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు విష్ణుప్రియ పెట్టే ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి కూడా. త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తుంటుంది. అలాగే ప‌లు పాట‌ల‌కు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోల‌ను పోస్ట్ చేస్తూ ఈమె అల‌రిస్తుంటుంది.

అయితే విష్ణు ప్రియ త‌న పెళ్లి ఎప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిపోతుందో చెప్పేసింది. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టింది. నవంబర్ 11 అనేది సింగిల్స్ డే. సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి.. అంటూనే.. వ‌చ్చే ఏడాది ఈ స‌మ‌యం వ‌రకు తాను మాత్రం సింగిల్‌గా ఉండ‌ను.. అని చెప్పింది. అంటే.. ఈమె త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కనున్న‌ట్లు తెలిసిపోతోంది. మ‌రి ఈమె ఎవ‌ర్ని, ఎప్పుడు వివాహ‌మాడుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now