Sreeja : శ్రీ‌జ‌, క‌ల్యాణ్ మ‌ధ్య‌.. అంతా సెట్ అయ్యిందా ?

November 11, 2021 5:46 PM

Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ, ఆమె భ‌ర్త‌, న‌టుడు క‌ల్యాన్ దేవ్‌ల రిలేష‌న్‌షిప్‌పై గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లుగా ఇటీవ‌ల క‌ల్యాణ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మెగా ఫ్యామిలీ జ‌రుపుకున్న దీపావ‌ళి వేడుక‌ల్లో అత‌ను క‌నిపించ‌లేదు.

is it ok between Sreeja and kalyaan

ఇక శ్రీ‌జ కూడా క‌ల్యాణ్‌తో ఉన్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌లేదు. దీంతో అనుమానాలు మ‌రీ ఎక్కువ‌య్యాయి. అయితే చివ‌రికి.. ఎట్టకేల‌కు.. అంద‌రి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. తాజాగా క‌ల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.

https://www.instagram.com/p/CWD_RLsBhMi/?utm_source=ig_web_copy_link

శ్రీ‌జ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. అందులో హ్యాపీ హ్యాపీ బ‌ర్త్ డే స్వీటు అని రాసుకొచ్చాడు. దీంతో ఆ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. అలాగే ఆ పోస్టులో ఎరుపు రంగు హార్ట్ సింబ‌ల్‌ను కూడా ఉంచాడు.

ఇక క‌ల్యాణ్ ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర‌సాని అనే మూవీల‌తోపాటు మ‌రో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now