Samantha : సూప‌ర్ స్టార్ సినిమాను మ‌ళ్లీ వ‌ద్ద‌నుకున్న స‌మంత ?

November 11, 2021 4:19 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డం లేదు. వ‌రుస‌గా సినిమాల‌కు సైన్ చేస్తోంది. అయితే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌మంత గ‌తంలో వ‌ద్ద‌న్న‌ద‌ని, ఆమె కొంత కాలం పాటు సినిమాల‌కు విరామం ఇచ్చి పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తోంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అందువ‌ల్లే ఆమె అప్ప‌ట్లో ఆ మూవీలో న‌టించ‌డం లేద‌ని తెలిసింది.

Samantha said again no to shah rukh khan movie

అయితే ద‌ర్శ‌కుడు అట్లీ ఆ అవ‌కాశాన్ని న‌య‌న‌తారకు ఇచ్చిన‌ట్లు తెలిసింది. కానీ షారూఖ్ ఖాన్ కుమారుడు జైలులో ఉండ‌డం వ‌ల్ల సినిమా షూటింగ్ ఆల‌స్యం అయింది. దీంతో న‌య‌న‌తార కాల్ షీట్స్ అడ్జ‌స్ట్ కాలేదు. ఈ క్ర‌మంలో ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే నాగ‌చైత‌న్య‌తో ఎలాగూ విడాకుల‌ను ప్ర‌క‌టించింది క‌నుక స‌మంతకు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి ఆమె ఈ మూవీలో న‌టించ‌వ‌చ్చ‌ని అట్లీ భావించార‌ట‌.

ఈ క్ర‌మంలోనే అట్లీ స‌మంత‌ను మ‌రోమారు ఈ మూవీలో న‌టించేందుకు అడిగార‌ట‌. అయితే ఈ వార్త‌లు ఇటీవ‌ల హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో షారూఖ్ ఖాన్ మూవీలో న‌టించే చాన్స్ మ‌రోమారు వ‌చ్చింద‌ని స‌మంత సంబ‌ర ప‌డింద‌ని తెలిసింది.

కానీ తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత ఈసారి వ‌చ్చిన అవ‌కాశాన్ని కూడా తిరస్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఆ మూవీలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాల్సి ఉంటుంది. కానీ స‌మంత‌కు ఇష్టం లేన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు న‌య‌న‌తార‌నే సంప్ర‌దించార‌ట‌. దీంతో న‌య‌న్ రెండోసారి ఈ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కాల్ షీట్స్ కుదిరితే త్వ‌ర‌లోనే న‌య‌న‌తార.. షారూఖ్‌తో క‌లిసి న‌టిస్తుంద‌ని అంటున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment