Balakrishna : సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌సీ.. మొద‌టి ఎఫెక్ట్ బాల‌య్య సినిమాకే..!

November 10, 2021 9:16 PM

Balakrishna : గ‌త కొద్ది నెల‌లుగా ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల‌పై తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఎంతో లాబీయింగ్ చేసింది. అయిన‌ప్ప‌టికీ రేట్ల‌ను త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ రాష్ట్రంలో విడుద‌ల కానున్న సినిమాల‌పై టిక్కెట్ల ధ‌ర‌ల ప్ర‌భావం ప‌డ‌నుంది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తే వ‌చ్చే ఆదాయం త‌గ్గుతుంది క‌నుక బ‌య్య‌ర్లు కూడా తాము సినిమా కొన్న ధ‌ర‌లో 30 శాతం త‌గ్గింపు కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Balakrishna movie will get first effect because of ap government policy

అయితే నిర్మాత‌లు బ‌య్య‌ర్ల‌తో చ‌ర్చ‌లు జరిపి ఆ మొత్తాన్ని 20 శాతానికి త‌గ్గించారు. దీంతో అంతిమంగా నిర్మాత‌ల‌కు న‌ష్టం రానుంది. ఇక ఈ విధానం వ‌ల్ల మొద‌ట‌గా ఎఫెక్ట్ ప‌డేది బాలయ్య సినిమా పైనే. డిసెంబ‌ర్ లో ముందుగా ఆయ‌న సినిమానే విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఆ మూవీని ఆంధ్రాలో రూ.35 కోట్ల‌కు, సీడెడ్ ఏరియాల్లో రూ.12 కోట్ల‌కు అమ్మారు. ఆ మొత్తంలో 20 శాతం మేర అంటే.. దాదాపుగా రూ.9.40 కోట్ల మేర అఖండ నిర్మాత‌లు న‌ష్ట‌పోనున్నారు.

అయితే ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌క‌పోతే మాత్రం ఆ ప్ర‌భావం ఇత‌ర సినిమాల‌పై కూడా ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే రానున్న 2 నెల‌ల్లో విడుద‌ల‌య్యే ప‌లు సినిమాల నిర్మాత‌లు ఏకంగా రూ.70 కోట్ల మేర న‌ష్ట పోతార‌ని లెక్క‌లు వేస్తున్నారు.

రానున్న నెల‌ల్లో అల్లు అర్జున్ పుష్ప‌, రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌, ఆచార్య‌, భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట వంటి మూవీలు విడుద‌ల కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీల నిర్మాత‌లు రూ.70 కోట్ల మేర న‌ష్ట‌పోతార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment