Karthikeya : నాకు కాబోయే భార్య ఆర్ ఎక్స్ 100 సినిమా ఇంతవరకు చూడలేదు

November 10, 2021 11:35 AM

Karthikeya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. హీరోగా, విలన్ గా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. లేటెస్ట్ గా కోలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనూ వినూత్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.

Karthikeya told that his would be wife not seen rx100 movie till now

రాజా విక్రమార్క సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంట్రెస్టెంట్ విశేషాల్ని పంచుకున్నాడు. కార్తికేయ హీరోగా వస్తున్న రాజా విక్రమార్క సినిమాలో ఎన్ఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఇందులో కార్తికేయ కామెడీ టైమింగ్ నవ్విస్తుందని అంటున్నారు. ఈ మూవీలో అన్ని పాత్రలు, అటు కామెడీని పంచుతూ, యాక్షన్ రీతిలో ఆకట్టుకుంటాయని అన్నారు. శ్రీ సరిపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చిందని, వెంటనే ఒకే చెప్పానని అన్నాడు. రియల్ లైఫ్ లో అందరిపై పంచులు వేస్తూ.. సరదాగా ఉంటానని అన్నాడు.

అలాంటి రియలిస్టిక్ పాత్ర సినిమాలో చేశానని అన్నాడు. ఎన్ఐఏ ఏజెంట్ గా వ్యవహరించే తీరు, గన్ ను పట్టుకునే విధానం గురించి తెలుసుకుని మరీ నటించానని అన్నాడు. ఫస్ట్ సినిమాకు వేరే టైటిల్ ను అనుకున్నారని, కానీ తర్వాత రాజా విక్రమార్క అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిపాడు.

ఈ విషయం చిరంజీవికి చెప్పామని, ఆయన కూడా ఓకే అన్నారని కార్తికేయ అన్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత ఫ్లాప్స్ ఎదురవ్వడంతో కార్తికేయ యాక్ట్ చేసే పాత్రలపై ఫోకస్ చేశానని.. కథలు వినేటప్పుడు ప్రేక్షకుడిలా వింటున్నానని అన్నాడు. ఇక రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. అలాగే స్టేజ్ మీద ప్రపోజ్ చేసే ప్లాన్ లోహితకు తెలియదని అన్నారు.

చాలా రోజులుగా ఆమెతో లవ్ లో ఉన్నట్లు తెలిపాడు. ఇంతవరకు ఆమెకు ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదని.. పెళ్ళి అయిపోతే మళ్ళీ ఆ అవకాశం రాదేమోనని మంచి మెమరీలా ఉండాలని ఇలా చేశానని అన్నాడు.

లోహిత ఇంతవరకు ఆర్ఎక్స్ 100 సినిమా చూడలేదట. ఆ సినిమా రిలీజ్ టైమ్ లో వీరిద్దరూ గొడవ పడ్డారని, కొన్ని రోజులు మాట్లాడుకోలేదని, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయాక సినిమా చూస్తానంటే వద్దన్నట్లు తెలిపాడు. ఒకవేళ ఆ సినిమా ఎప్పుడైనా చూడాలనుకుంటే సెకండాఫ్ నుండి చూడమని చెబుతానని అన్నాడు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే అజిత్ హీరోగా వస్తున్న వాలిమై సినిమాలో నటించడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment