Rashmi Gautam : మానవత్వం చచ్చిపోయింది.. అంటూ తెగ బాధ‌ప‌డ్డ యాంక‌ర్ ర‌ష్మీ..

November 10, 2021 10:45 AM

Rashmi Gautam : తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్లు, నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. తన టాలెంట్ తో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రజంట్ తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఎదిగింది. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ.. తన హవా చాటుకుంటోంది. తన ఫ్యాన్స్ కి చేరువగా సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్ విశేషాలతోపాటు పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటోంది. అంతేకాదు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తోంది.

Rashmi Gautam said humanity is closed feels very sad

అలాగే ఎన్నో సందర్భాల్లోనూ.. ఎన్నో ఇంటర్వ్యూల్లోనూ తనకు మూగజీవాలంటే ప్రేమ అనే విషయాన్ని తెలిపింది. జంతువులపై దాడి చేసిన సందర్భాలలో వ్యక్తులపై కూడా రష్మీ రెస్పాండ్ అవుతోంది. ముఖ్యంగా జంతువులకు ఎలాంటి హానీ జరిగినా ఊరుకోదు. గతంలో కూడా కొన్ని వీధి కుక్కలపై జరుగుతున్న ట్రీట్ మెంట్ విషయంలో కూడా ఈమె రియాక్ట్ అయ్యింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రష్మీ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. దీపావళి వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది.

అందరూ ఎకో ఫ్రెండ్లీ దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటుండగా, కొంతమంది సైకోలు ఓ వీధి కుక్కను దారుణంగా హింసించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చారు. ఆ దాడితో కుక్క కాలుకు గాయాలై.. తోక తెగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి.. ఆ కుక్కను హాస్పిటల్ కు తీసుకెళ్ళి ట్రీట్ మెంట్ చేయించారు. ఆ కుక్క పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఇక ఈ ఘటనపై యాంకర్ రష్మీ గౌతమ్ ఓ పోస్ట్ చేసింది. మానవత్వం చచ్చిపోయింది.. ఈ భూమిపై మానవజాతి అంతరించే సమయం వచ్చింది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా ఆ సైకోలను శిక్షించాలని కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment