Bigg Boss 5 : జెస్సీని అడ్డుపెట్టుకొని అంద‌రినీ పిచ్చోళ్ల‌ని చేసిన బిగ్ బాస్..!

November 10, 2021 8:14 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఎపిసోడ్ నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సాగింది. ముఖ్యంగా జ‌స్వంత్‌ని అడ్డుపెట్టుకొని బిగ్ బాస్ అంద‌రిని ఫూల్స్‌ని చేశాడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జ‌స్వంత్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా.. ఫర్లేదు బాగానే ఉంది కానీ.. పడుకుంటే భూమి గుండ్రంగా తిరిగినట్టుగా అనిపిస్తుందని చెప్పాడు జెస్సీ.

Bigg Boss 5 organizers fooled audience by sending jessy into secret room

ఇప్పుడు మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం.. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో క‌న్ఫెష‌న్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌స్వంత్ .. అంద‌రికీ తాను వెళుతున్న‌ట్టు చెప్పాడు. జెస్సీ వెళ్తూ వెళ్తూ చాలా చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. నా హెల్త్ బాగాలేనందుకు చాలామంది పేంపరింగ్ చేశారు. మానస్, సన్నీ, కాజల్, పింకీ, ఆనీ అందరూ. షణ్ముఖ్, సిరి పేర్లను చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నా హార్ట్‌కి దగ్గరైన వాళ్లు. మీ ఇద్దరితో జర్నీ ఈ రోజు వరకే ఉంది.. ఇక్కడివరకే నేను బిగ్ బాస్ చూస్తా. నేను సాధించలేకపోతున్నా.. అది మీరు చేసి చూపించాలి’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు జెస్సీ.

జెస్సీ వెళ్లిపోయినందుకు ష‌ణ్ముఖ్, సిరి తెగ బాధ‌ప‌డిపోయారు. ప్రేక్ష‌కులు కూడా ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. కానీ అంద‌రినీ పిచ్చోళ్ల‌ను చేసి జెస్సీని తీసుకెళ్లి సీక్రెట్ రూంలో ఉంచాడు బిగ్ బాస్. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ.. ‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు.. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు జెస్సీ.

మిమ్మల్ని వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకుని వెళ్లాం.. డాక్టర్లు పరీక్షించి ఆల్ క్లియర్ అని చెప్పారు. కానీ.. ఇంట్లోకి వెళ్లడానికి ముందు క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకూ మీరు క్వారంటైన్‌‌లోనే ఉండాలని చెప్పారు బిగ్ బాస్. మరి జెస్సీ మళ్లీ హౌస్‌లోకి ఎప్పుడు వెళ్తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment