Sri Rama Chandra : మరోసారి తెరపైకి శ్రీరెడ్డి – శ్రీ రామ్ చంద్ర వాట్సాప్ చాట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రీ రామ్ ఫ్యాన్స్ !

November 10, 2021 8:39 AM

Sri Rama Chandra : సింగర్ గా, ఇండియన్ ఐడల్ గా ఎంతో మంచి పేరు, ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీరామచంద్ర బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన బుద్ధి బలం, కండ బలంతో ఎంతో చాకచక్యంగా ఈ గేమ్ ఆడుతున్న శ్రీ రామచంద్ర గురించి సంచలన తార శ్రీ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  గతంలో శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Sri Reddy shared whatsapp chats of Sri Rama Chandra

ఈ క్రమంలోనే ఈ వాట్సాప్ చాట్ షేర్ చేస్తూ.. చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్‌.. అంటూ శ్రీ రామచంద్ర తనతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ వివాదాన్ని మరొకసారి శ్రీరెడ్డి తెరపైకి తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీ రామచంద్రపై సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులలో నెగిటివిటీ ఏర్పడింది. శ్రీరామ్ అంటే నచ్చని వాళ్ళు దీనిని ఒక ఆయుధంగా చేసుకొని తనని టార్గెట్ చేస్తున్నారు. కానీ శ్రీరామచంద్ర అభిమానులు మాత్రం ఈ విషయంపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అతనికి మద్దతుగా పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. శ్రీ రామచంద్రకు వారు తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment