Samantha : చెవిలో పువ్వు పెట్టిన సమంత.. ఏం జరిగిందంటే ?

November 10, 2021 8:32 AM

Samantha : సమంత విడాకుల ప్రకటన తర్వాత ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో నిలుస్తోంది. తన విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం సమంత తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ బాధ నుంచి బయట పడటం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సమంత తన స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. విడాకుల తర్వాత పూర్తిగా సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Samantha put flower in her ear what happened

ఈ క్రమంలోనే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అదే విధంగా తన సాకీ బ్రాడ్ దుస్తులను ప్రమోట్ చేయడం కోసం ఎన్నో అవస్థలు పడుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రకరకాల దుస్తులు ధరించి, చెవిలో పువ్వు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక విడాకుల తర్వాత సమంత ఎంతో అరుదైన గౌరవం దక్కించుకుంది. గోవాలో జరగబోయే ఐఫా వేడుకల కోసం సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించే అరుదైన ఆహ్వానాన్ని దక్కించుకుంది. ఇలా ఐఫా వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ నటిగా సమంత పేరు సంపాదించుకుంది. విడాకుల తర్వాత సమంత తన కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టి ఎంతో బిజీగా గడుపుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment