Apparao : స్టేజ్ పై అప్పారావు చేసిన పనికి.. తల పక్కన పెట్టుకున్న సుమ.. ఏం జరిగిందంటే ?

November 9, 2021 11:03 PM

Apparao : జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్ లలో అప్పారావు ఒకరు. ఈయన జబర్దస్త్ వేదికపై చేసే కామెడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అప్పారావు కేవలం జబర్దస్త్ వేదికపై మాత్రమే కాకుండా పలు చిత్రాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక జబర్దస్త్ వేదికపై ఆయన భార్య సుబ్బలక్ష్మి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన కామెడీని పండించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన అప్పారావు ఇతర కార్యక్రమాలలో తన భార్యతో కలిసి పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.

Apparao and his wife on stage suma surprised

ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి అప్పారావు తన భార్యతో కలిసి వచ్చారు. క్యాష్ వేదికపై అప్పారావు, ఆయన భార్య సుబ్బలక్ష్మిని పలు టాస్క్ లతో సుమ సందడి చేయించింది.  ఒక టాస్క్ లో భాగంగా అప్పారావు, సుబ్బలక్ష్మి లవ్ మ్యారేజ్ చేసుకున్న వారి మాదిరిగా నటించమని సుమ చెప్పడంతో ఈ జంట రెచ్చిపోయారు.

ఈ టాస్క్ లో భాగంగా అప్పారావు తన భార్య సుబ్బలక్ష్మిని ముద్దు అడగడంతో ఇప్పుడు వద్దంటూనే స్టేజ్ పైనే కెమెరాలకు కనిపించకుండా లిప్ కిస్ చేసుకున్నట్లు చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇలాంటి వేదికపైనే అప్పారావు దంపతులు చేసిన పనికి సుమ తల దించుకుని ఒక్కసారిగా నోటి పై వేలు వేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment