Lawrence : రియల్ సినతల్లికి సహాయం చేసిన లారెన్స్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

November 9, 2021 5:38 PM

Lawrence : తమిళ స్టార్ హీరో సూర్య.. సినిమా కథల ఎంపిక విషయంలో ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ఆకాశమే నీ హద్దురా అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ఎంతో మంచి ప్రేక్షకాదరణ తగ్గించుకుంది. తాజాగా సూర్య జై భీమ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుని ఎంతోమంది చేత ప్రశంసలు అందుకుంటోంది.

Lawrence helped a woman living in hut

తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ తన భర్త పట్ల జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయం కోసం ఎంతో పోరాడింది. సుమారుగా 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆధారంగా చేసుకుని దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో లాయర్ పాత్రలో సూర్య ఎంతో అద్భుతంగా నటించారు.

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటుడు, దర్శకుడు లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సినిమా చూసి చలించిపోయిన లారెన్స్ నిజ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న పార్వతికి సహాయం చేశారు. ఆమె  ప్రస్తుతం ఒక పూరి గుడిసెలో నివసించడం చూసిన లారెన్స్ ఎంతో ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే ఆమెకు ఒక ఇంటిని తన సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తానని మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment