Poonam Pandey : పూన‌మ్ పాండేని ర‌క్తం కారేలా కొట్టిన ఆమె భ‌ర్త‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మోడ‌ల్..

November 9, 2021 12:42 PM

Poonam Pandey : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 2011 వరల్డ్ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్ సమయంలో.. ఇండియా కప్ కొడితే, నగ్నంగా కనిపిస్తాను అంటూ.. బోల్డ్ కామెంట్స్‌ చేసింది. పూనమ్ తీరుపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక సామ్ బోంబే అనే వ్య‌క్తిని పెళ్లాడిన పూన‌మ్ ఆయ‌న‌తో గోవాకి హ‌నీమూన్‌కి వెళ్లింది. అక్క‌డ త‌న భర్త తనను అసహజ శృంగారం కోసం హింసించాడంటూ గత ఏడాది పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Poonam Pandey admitted in hospital her husband beat her

కొద్ది రోజుల త‌ర్వాత పూన‌మ్ భ‌ర్త సామ్ బోంబే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాత పూనమ్‌తో రాజీ పడ్డాడు. ఇద్దరూ బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. భర్తతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని, తామిద్దరం సంతోషంగా జీవిస్తున్నామంటూ పూనమ్ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చింది. తాజాగా పూన‌మ్.. సామ్ బోంబే హత్యాయత్నానికి పాల్పడ్డాడని , ఈ మేరకు ఆమె బాంద్రా పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేసింది.

పూన‌మ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. త్వరలోనే అతణ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే సామ్‌ బోంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్‌ బోంబే.. పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్‌ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూన‌మ్ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment