Bigg Boss 5 : ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే.. డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఎవరంటే..?

November 8, 2021 11:10 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్ లను ఎలిమినేట్ చేసింది. ఇక 10వ వారంలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ లో ఈ వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. సిరి, రవి, సన్నీ, మానస్, కాజల్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.

Bigg Boss 5 these are the contestants in nomination who is in danger zone

ఇలా పదవ వారం నామినేషన్ లో ఈ ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు .బిగ్ బాస్ హౌస్ లో వారాలు గడుస్తున్నప్పటికీ వీరి మధ్య బంధాలు బలపడినట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎంత కష్టపడి టాస్క్ లు ఆడినా చివరికి బయట ప్రేక్షకులు వేసే ఓట్లపై ఆధారపడి ఉంటుందని విశ్వ విషయంలో తేలిపోయింది.

అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్ లలో ఎక్కువగా హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కాజల్ కే ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతమున్న ఐదు మంది కంటెస్టెంట్ లలో కాజల్ డేంజర్ జోన్ ఉన్నట్టు తెలుస్తోంది. నామినేషన్ లో ఉన్న మిగిలిన వారందరికీ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంవల్ల వీరందరూ సేఫ్ జోన్ లో ఉన్నారని, వీరితో పోల్చుకుంటే కాజల్ డేంజర్ లో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment