కరోనా భయం వెంటాడుతోందా? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఇది ట్రై చేయాల్సింది!

April 28, 2021 10:29 PM

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ గురించి ఎవరు భయపడాల్సిన పనిలేదు.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలను పాటిస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.

కరోనా వచ్చినా రాకపోయినా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మన శరీరానికి సరిపడే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ మనపై దాడి చేయదు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మన ఇంట్లో దొరికే కొన్ని మసాలా దినుసులు ద్వారా కషాయం తయారుచేసుకొని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.

ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో పసుపు వేసి బాగా మరిగించాలి. దీని తర్వాత ఆరు తులసి ఆకులు, కొన్ని నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,8 లవంగాలు, అల్లం ముక్క ఒక్కొక్కటిగా వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment