Sukumar : పుష్ప మూవీ ఎఫెక్ట్.. తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న‌లో సుకుమార్‌..?

November 7, 2021 11:01 PM

Sukumar : అల్లు అర్జున్‌తో క‌లిసి మూడో సారి సినిమాకు ప‌నిచేస్తున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ చూస్తుంటే తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఓవైపు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండడం, టాకీ పార్ట్ షూటింగ్‌, 1000 మంది డ్యాన్స‌ర్ల‌తో ప్ర‌త్యేక‌మైన పాట‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు.. ఇవ‌న్నీ ఇంకా మిగిలే ఉన్నాయి. దీంతో సుకుమార్ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది.

Sukumar pushpa movie effect pressure on him

పుష్ప మూవీని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబ‌ర్ 17వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో మూవీ విడుద‌ల‌కు మ‌రో 40 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలోనే పైన చెప్పిన ప‌నుల‌న్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ క్ర‌మంలోనే అన్ని భాష‌ల‌కు చెందిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను సుకుమార్ స్వ‌యంగా ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక త‌న అవ‌స‌రం లేని, పెండింగ్‌లో ఉన్న సీన్ల‌ను స‌హాయక ద‌ర్శ‌కుల‌చే చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ సీన్ల‌కు గాను సుకుమార్ వీడియో కాల్స్ తో మేనేజ్ చేస్తున్నార‌ట‌. దీంతో సుకుమార్‌పై అధికంగా భారం, ఒత్తిడి ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.

అయితే ఇంత ఒత్తిడి, భారం ప‌డినా.. అవుట్ పుట్ స‌రిగ్గా రాక‌పోతే అప్పుడు ద‌ర్శ‌కుడినే అంటారు. దీంతో సుకుమార్ అత్యంత సున్నితంగా, జాగ్ర‌త్త‌గా ఈ వ్య‌వ‌హారాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్క‌డ తేడా కొట్టినా.. ముందుగా అనేది ద‌ర్శ‌కుడినే. మ‌రి సుకుమార్ ప‌డ్డ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం సినిమాలో క‌నిపిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment