Samantha : బంగారు దుస్తుల్లో మెరిసిపోతున్న స‌మంత‌..!

November 6, 2021 4:42 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే విడాకుల కార‌ణంగా త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌, విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఆమె యూట్యూబ్ చాన‌ల్స్‌తో నెల‌కొన్న వివాదంలో కోర్టు వ‌ర‌కు వెళ్లి విజ‌యం సాధించింది. త‌రువాత ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ‌రుస టూర్స్ వేసింది.

Samantha new golden color dress photos viral

టూర్స్ నుంచి వ‌చ్చాక కూడా స‌మంత ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో పోస్టులు పెడుతోంది. ప‌లు బ్రాండ్ల‌కు ఆమె ప్ర‌చార‌క‌ర్త‌గా ఉండ‌డం వ‌ల్ల ఆయా బ్రాండ్ల‌ను ఆమె ప్ర‌మోట్ చేస్తోంది. అందులో భాగంగానే ఓ బ్రాండ్‌కు చెందిన దుస్తులు, ఆభ‌ర‌ణాల‌ను ఆమె ప్ర‌మోట్ చేస్తూ తాజాగా పోస్టులు పెట్టింది. అవి వైర‌ల్‌గా మారాయి.

సోష‌ల్ మీడియాలో సమంత ఇటీవ‌లి కాలంలో యాక్టివ్‌గానే ఉంటున్న‌ప్ప‌టికీ.. ఎక్కువ‌గా సందేశాలు ఇస్తోంది. తాజాగా దీపావ‌ళికి కూడా బాణ‌సంచాను నిషేధించ‌వ‌ద్ద‌ని కోరింది. కాలుష్యాన్ని త‌గ్గించేందుకు పెద్ద‌లు కావాలంటే కాలి న‌డ‌క‌న వెళ్లండి కానీ చిన్న పిల్ల‌ల సంతోషాల‌ను అడ్డుకోవ‌ద్ద‌ని పోస్టు పెట్టింది.

సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత న‌టించిన శాకుంత‌లం మూవీ విడుద‌లకు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఆహాలో ఆమె ఒక వెబ్ సిరీస్‌లో క‌నిపిస్తుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment