Samantha : విడాకుల తరువాత రెమ్యునరేషన్‌ను భారీగా పెంచిన సమంత.. ఒక సినిమాకు ఏకంగా అన్ని కోట్లు..?

November 5, 2021 3:00 PM

Samantha : నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత తన స్నేహితులతో గడుపుతూ తన బాధ నుంచి బయట పడటానికి ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే చైతన్యతో తనకున్న జ్ఞాపకాలను మరిచిపోవడం కోసం సమంత తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విదేశాలకు టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ఇక సమంత తన తదుపరి ప్రాజెక్ట్ లపై కూడా దృష్టి పెడుతోంది.

Samantha increased remuneration for her movies

అయితే విడాకుల తర్వాత సమంత రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన దూకుడును కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తను తర్వాత చేయబోయే ప్రాజెక్టులన్నింటికీ భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు కొంతమేర నిరాశను వ్యక్తం చేస్తున్నారట. ఒకేసారి సమంత జీఎస్టీ కాకుండా ఏకంగా ఒక సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా సమంత రెమ్యూనరేషన్ విషయంలో మొండి పట్టు పడటం చేత పలువురు నిర్మాతలు ఇతర హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమా కోసం నిర్మాతలు సంప్రదించగా ఒక్కసారిగా ఈమె తన రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేసినట్లు సమాచారం.

విడాకుల ప్రకటన అనంతరం సమంతతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారట. అందుకనే ఆమె అమాంతం రెమ్యునరేషన్‌ను పెంచినట్లు టాక్‌ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment