Samantha : చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ స‌మంత ఇలా.. అంతా మ‌రిచిపోయిందా..?

November 4, 2021 12:45 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాక స‌మంత ఎప్పుడు క‌నిపించినా.. డ‌ల్‌గా ఉండేది. ఏదో కోల్పోయిన‌ట్లు క‌నిపించింది. ఎన్‌టీఆర్‌తో క‌ల‌సి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో స‌మంత మ‌న‌స్థాపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌నిపించింది. ముఖంలో అస‌లు జీవం, క‌ళ లేదు. త‌రువాత ఆధ్యాత్మిక క్షేత్రాల‌ని, దుబాయ్ టూర్ అని అక్క‌డికీ, ఇక్క‌డికీ తిరుగుతూ పోస్టుల‌ను పెడుతున్న‌ప్ప‌టికీ ఆమె ముఖంలో ఎక్క‌డా యాక్టివ్‌నెస్ కనిపించ‌లేదు. అయితే తాజాగా ఆ డల్‌నెస్ అంతా పోయి ఫ్రెష్‌గా స‌మంత క‌నిపిస్తుండ‌డం విశేషం.

Samantha looks pretty and amazing fresh though she forgotten all

స‌మంత ఎప్పుడూ త‌న ఫొటోషూట్‌ల‌కు చెందిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవ‌లి కాలంలో ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ముఖంలో ఎలాంటి క‌ళ లేదు. కానీ తాజాగా దీపావ‌ళి రోజున ఆమె షేర్ చేసిన ఫొటోల్లో మ‌ళ్లీ మునుప‌టి క‌ళ‌, యాక్టివ్‌నెస్ క‌నిపిస్తుండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే స‌మంత గ‌త కొంత‌కాలంగా త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌ను, విమ‌ర్శ‌ల‌ను అన్నింటినీ మ‌రిచిపోయి.. విడాకుల విష‌యాన్ని కూడా మ‌రిచిపోయి.. ఎంతో హ్యాపీగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

స‌మంత విడాకుల ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్ప‌డ‌మే కాకుండా.. ఆహాతో ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే తాప్సీకి బాలీవుడ్ ఉన్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ ద్వారా స‌మంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు కూడా స‌మాచారం అందుతోంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment