Samantha : నేను మనిషిని, నాకు నేనే పర్‌ఫెక్ట్‌.. ప్రేమిస్తున్నాను.. సమంత పోస్ట్ వైరల్..

November 2, 2021 11:41 PM

Samantha : సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించి సరిగ్గా నెల రోజులు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినబడుతూనే ఉంటోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి అంకితమైపోయింది. ప్రస్తుతం ఈ బాధ నుంచి బయటపడిన తర్వాత సమంత తన దృష్టి మొత్తం సినిమాలపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకున్న తరువాత తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా.. మా అమ్మ చెప్పిందిజజ అంటూ తనలో ఉన్న బాధని బయట పెడుతోంది.

Samantha said she is a human being and she is perfect

తాజాగా సమంత మరోసారి.. మా అమ్మ చెప్పింది.. అంటూ ఒక పోస్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సమంత.. నా జీవితంలో నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని తిరిగి జీవితంలో నిలబడే సత్తా నాకు ఉంది. నేను ఎంతో బలవంతురాలిని.. నేను ఇతరులకు ఫర్ఫెక్ట్ కాకపోవచ్చు.. నాకు నేను ఫర్ఫెక్ట్, నేను ప్రేమిస్తున్నా.. ఈ విపత్కర పరిస్థితుల్లో నేను విజయం సాధించే యోధురాలిని.. మనిషిని.. మా అమ్మ చెప్పింది.. అంటూ మరోసారి సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

విడాకుల తర్వాత సమంత తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాకుండా పలు తీర్థయాత్రలు చేస్తూ.. తన బాధ నుంచి బయట పడటం కోసం ఎంతో కష్టపడుతోంది. ఇక సమంత ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నటి తాప్సీ ప్రొడక్షన్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment