Suma : బుల్లితెర రారాణి సుమ ఇప్పుడు వెండితెర‌పై కూడా సంద‌డి చేయ‌బోతుందా ?

November 2, 2021 8:21 PM

Suma : బుల్లితెర రారాణి సుమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎన్నో షోస్‌, మ‌రెన్నో ఈవెంట్స్, మ‌రెన్నో సీరియ‌ల్స్.. కొన్ని ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్న సుమ‌కు వెండితెర‌పై చేసేస్తే పోలా అనే ఆలోచ‌న‌ వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా సుమ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సుమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

Suma to act in movies posted a video

ఓ వీడియో ద్వారా సుమ సినిమాలు చేసేస్తే పోలా అని చెప్పింది. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు. సుమ సినిమాలు చేస్తే కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ ఇస్తారంటూ కూడా ఆ వీడియోలో ఉంది. ఇప్ప‌టికే సుమ భ‌ర్త సినిమాలు చేస్తున్నారు. త‌న‌యుడిని సినిమాల‌లోకి తెచ్చే ఏర్పాట్లు కూడా చేశారు.

సుమ త‌న‌యుడు రోష‌న్.. నిర్మ‌లా కాన్వెంట్ చిత్రంలో ఒక పాత్ర‌లో న‌టించారు. పూర్తి స్థాయి హీరోగా క‌నిపించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యారు. ఆ మ‌ధ్య‌ రోహ‌న్ మొద‌టి చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి. మ‌రోవైపు సుమ కుమార్తె కూడా సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేందుకు ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment