Bigg Boss 5 : హౌజ్‌లో ఎనిమిది వారాలు ఉన్న లోబో ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడో తెలుసా?

November 1, 2021 10:42 PM

Bigg Boss 5 : గ‌త సీజ‌న్‌లో అవినాష్ త‌న కామెడీతో క‌డుపుబ్బా న‌వ్విస్తే ఆ బాధ్య‌త‌ను లోబో తీసుకున్నాడు. ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌చ్చిన లోబో సీక్రెట్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక డ‌ల్ అయ్యాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ స‌రిగా లేద‌ని భావించిన హౌజ్ మేట్స్ లోబోని ఎలిమినేట్ చేశారు. అంద‌రూ భోరుభోరున ఏడ్చుకుంటూ హౌజ్ నుండి బ‌య‌ట‌కు రాగా, లోబో మాత్రం చాలా కూల్‌గా వ‌చ్చేశాడు.

Bigg Boss 5 do you know how much lobo took as remuneration for 8 weeks

లోబో.. ఒక మంచి కమెడియన్‌గా చాలామంది ప్రేక్షకులకు తెలుసు. తను బయట ఎలా తన కామెడీతో అందరినీ మెప్పించాడో.. హౌస్‌లో కూడా అందరినీ అలాగే ఎంటర్‌టైన్ చేశాడు. తాను చాలా కష్టపడి కెరీర్‌లో పైకి వచ్చానని, బస్తీలో ఉండే కష్టాలన్నీ తాను అనుభవించానని లోబో మాటిమాటికీ చెబుతూ ఉండేవాడు. అప్పటినుండే ప్రేక్షకుల్లో తనపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. నాగార్జున కూడా ఇదే విష‌యంపై ప‌లుమార్లు లోబోని హెచ్చ‌రించాడు.

లోబో త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోక‌పోవ‌డం, టాస్క్‌ల‌లో పెద్ద‌గా ఆస‌క్తి పెట్ట‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు లోబోని ఎలిమినేట్ చేశారు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన లోబో ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్నాడు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో లోబోకు ఒక్కరోజుకు రూ.35 వేల రెమ్యునరేషనల్ అందిందట. అంటే వారానికి రెండున్నర లక్షలు మొత్తంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్‌ను తీసుకెళ్లాడు లోబో. మోత్తానికి డ‌బ్బుతోపాటు మంచి క్రేజ్ కూడా సంపాదించాడు లోబో.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment