Samantha : తాప్సీతో క‌లిసి బాలీవుడ్‌ను షేక్ చేయ‌బోతున్న స‌మంత ?

November 1, 2021 4:45 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత ఆధ్యాత్మిక టూర్లు వేస్తూనే మ‌రోవైపు ప‌లు సినిమాల‌కు సైన్ చేసింది. ఇక ప్ర‌స్తుతం ఆమె దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. అయితే త్వ‌ర‌లో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు తాప్సీతో ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ట‌.

Samantha to shake bollywood with the help of tapsee

బాలీవుడ్‌లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల‌తో తాప్సీకి మంచి పేరు వ‌చ్చింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా అటు నార్త్‌లోనూ స‌మంత న‌టిగా మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమెతో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను తీయాల‌ని తాప్సీ భావిస్తోంద‌ట‌. తాప్సీకి అక్క‌డ ఔట్ సైడ‌ర్ ఫిలిమ్స్ అనే ప్రొడక్ష‌న్ హౌజ్ ఉంది. దీంతో త‌మ నిర్మాణ సంస్థ ద్వారా స‌మంత‌ను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయాల‌ని తాప్సీ భావిస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మ‌ని, ఆమె తాప్సీతో క‌లిసి బాలీవుడ్‌ను షేక్ చేస్తుంద‌ని అంటున్నారు.

ఇక తెలుగులోనూ స‌మంత ప‌లు సినిమాల‌కు సైన్ చేసింది. ఆమె న‌టించిన శాకుంత‌లం అనే మూవీతోపాటు కాతు వాకుల రెండు కాద‌ల్ అనే మూవీ సైతం త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. మ‌రి బాలీవుడ్‌లో స‌మంత‌కు అదృష్టం క‌ల‌సి వ‌స్తుందో, లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment