Samantha : సమంత చేసిన పని.. చర్చనీయాంశం..!

November 1, 2021 6:34 PM

Samantha : రీసెంట్‌గా తెలంగాణ‌లోని ఓ గే జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్‌ పరిచయం ఏర్ప‌డ‌గా, వీరిద్దరూ ఎనిమిదెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.

Samantha wished a couple and its going viral topic

ఈ ఇద్దరి ఇష్టాలను సమాజానికి తెలియజేసి వివాహ బంధంతో ఒకటి కావాలనుకుంటున్నారు. సుప్రియో – అభయ్‌ల గే జంట ఎనిమిదేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత డిసెంబరులో పెళ్లి చేసుకున్నారట. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు (గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు.

సమంత గే మ్యారేజ్ కు సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ ను షేర్ చేయడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత స‌మంత వారిద్దరికీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేసింది సమంత. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – నయనతారలతో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment