Allu Arjun : పునీత్ మరణం తలుచుకుని భావోద్వేగమైన ఐకాన్ స్టార్..!

October 31, 2021 2:28 PM

Allu Arjun : శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ మరణం సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన లేరన్న మరణవార్తను ఇప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.

Allu Arjun become emotional with the death of puneeth rajkumar

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భావోద్వేగం అయ్యారు. శనివారం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అల్లుఅర్జున్ ఈ సందర్భంగా పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న స్టార్ హీరో ఇలా అర్ధాంతరంగా మరణించడం ఎంతో బాధాకరం అంటూ ఆయన లేరనే వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ కూడా పునీత్ మరణం పట్ల స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ మరణం చాలా బాధాకరం, కొన్ని రోజుల క్రితం నేను తనని కలిశాను, ఆయన ఇంటికి కూడా నన్ను ఆహ్వానించారని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పునీత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment