ఐపీఎల్ టీ20: ఉత్కంఠ పోరులో హైద‌రాబాద్‌పై ఢిల్లీ గెలుపు..!

April 25, 2021 11:51 PM

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన ఈ మ్యాచ్ చివ‌ర‌కు సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో సూప‌ర్ ఓవ‌ర్‌లో హైద‌రాబాద్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ క‌ష్ట‌ప‌డి ఛేదించింది. హైద‌రాబాద్‌పై ఢిల్లీ సూప‌ర్ ఓవ‌ర్‌లో గెలుపొందింది.

delhi won in super over against hyderabad in ipl 2021 20th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో పృథ్వి షా, రిష‌బ్ పంత్‌లు రాణించారు. 39 బంతులు ఆడిన షా 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 53 ప‌రుగులు చేయ‌గా, 27 బంతుల్లో పంత్ 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 37 ప‌రుగులు చేశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీయ‌గా, ర‌షీద్ ఖాన్‌కు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్‌, జానీ బెయిర్‌స్టోలు రాణించారు. 51 బంతుల్లో విలియ‌మ్స‌న్ 8 ఫోర్ల‌తో 66 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, 18 బంతుల్లో బెయిర్‌స్టో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 38 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అవేష్ ఖాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అక్ష‌ర్ ప‌టేల్ 2 వికెట్లు తీశాడు. అమిత్ మిశ్రాకు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment