Chiranjeevi Pawan Kalyan : సినిమాలకు మెగా బ్రదర్స్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారా ? అందుకనేనా పోటీపడి మరీ వరుస సినిమాలు..?

October 28, 2021 6:11 PM

Chiranjeevi Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక సినిమాకి.. మరో సినిమాకి.. మధ్య గ్యాప్ కాస్త ఎక్కువగానే ఇస్తారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఎప్పుడూ ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాను తెరకెక్కిస్తారు. కానీ లేటెస్ట్ గా రెండు, మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Chiranjeevi Pawan Kalyan may take break from movies as they are doing continuous films

ఈ సినిమా పాటల్ని ఫిల్మ్ టీమ్ తెరకెక్కిస్తోంది. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ పడింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ గురించి వార్తలు హల్ చల్ అవుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే రూట్ లో వెళ్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న క్రమంలో ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.

ఈ షూటింగ్ లో భాగంగా ఆయన చేతికి చిన్నపాటి సర్జరీ చేయడంతో తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అలాగే నవంబర్ ఫస్ట్ వీక్ లో బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఓ సినిమాను కూడా ప్రారంభించేందుకు షెడ్యూల్ ని రెడీ చేస్తున్నారు. అలాగే భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా నవంబర్ 15 నుండి ప్రారంభం అవుతుందని ఫిల్మ్ టీమ్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

మెహర్ రమేష్ డైరెక్షన్ వహిస్తున్న సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. వీరిద్దరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కించి ఒక్కో సినిమాకి 50 నుండి 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాలని.. మెగా బ్రదర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఇద్దరూ పోటీ పడి మరీ వరుసగా సినిమాలు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా అభిమానులకు ఇది షాకింగ్‌ లాంటి న్యూసే అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now