Bhola Shankar : భోళాశంకర్ కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం కానున్న షూటింగ్..!

October 28, 2021 10:58 AM

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుత హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

Bhola Shankar muhurtham shooting will start on that day

ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌ దశలో ఉండగా మెగాస్టార్ చేతికి చిన్న సర్జరీ కావడంతో ఈ షూటింగ్ వాయిదా పడింది. ఇక భోళాశంకర్ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉండడం చేత కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని.. ముందుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పట్టాలెక్కనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్నింటినీ తిప్పికొడుతూ భోళాశంకర్ చిత్రబృందం మెగా అభిమానులకు శుభవార్తను తెలియజేసింది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ ఓపెనింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11వ తేదీన 7:45 నిమిషాలకు ఈ చిత్రం ఓపెనింగ్ కాగా నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లను ప్రారంభించనున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తుండడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment