కరోనా సమయంలో మహేష్ బాబు సినిమా డైలాగ్ లను వాడుతున్న పోలీసులు

April 25, 2021 10:34 PM

సోషల్ మీడియా.. ఈ మీడియా ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఈ సోషల్ మీడియాను ఉపయోగించి ఎంతో మంది ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి అవగాహనలను కలుగజేయవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవగాహన కలిగి చేసే విషయంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రజల్లో ట్రాఫిక్,సైబర్ నేరగాళ్ల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్టులను చేస్తుంటారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్ పోలీసులు ఏకంగా మహేష్ బాబు సినిమా డైలాగ్ లను వాడుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం మాత్రమే. ఇందులో భాగంగానే మాస్క్ ధరించడం అవసరాన్ని వివరిస్తూ మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ సినిమాలోని డైలాగులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. ఈ వీడియోలో “జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు, బి అలర్ట్.. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.. మాస్కు ధరించండి” అనే డైలాగ్ లను పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా కరోనా బారిన పడినవారికి ప్లాస్మా దానం ఎంత అవసరమో మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు ఆ అవసరం మరింత పెరిగింది. ప్లాస్మా దానం చేయాలని గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వీడియోను మహేష్ బాబు షేర్ చేస్తూ… కరోనాతో పోరాడుతున్న వారికి మనకు చేతనైన సహాయం చేద్దాం.. గతంలో కంటే ప్రస్తుతం ప్లాస్మా దానం ఎంతో అవసరం, హైదరాబాద్ పోలీసులకు కమిషనర్ సజ్జనార్ తీసుకున్న చొరవకు నా మద్దతు ఉంటుందని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment