Samantha : బాలీవుడ్‌లో స్పీడ్ పెంచాల‌నుకుంటున్న స‌మంత‌.. కొత్త ఏజెన్సీ మొద‌లు పెట్టిందా?

October 26, 2021 9:24 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత త‌న కెరియ‌ర్‌పై పూర్తి దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే శాకుంత‌లం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామ్ త‌మిళ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌రైంది. స‌మంత‌ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండ‌గా, ఇటీవ‌ల రెండింటికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక‌ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కు బాలీవుడ్ ఆఫ‌ర్స్ బాగా వ‌స్తున్నాయ‌ట‌.

Samantha speeding towards bollywood may open agency

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కొన్ని స్క్రిప్ట్ లను వింటుందని, కొత్త ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలున్నంత వ‌ర‌కు ఎక్కువ సినిమాలను హిందీలో చేయాల‌ని స‌మంత భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ఆమె కోసం ముంబైలో పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయ‌నే టాక్ న‌డుస్తోంది. ఈ భామ నేషనల్ మీడియాలో కార్పొరేట్ బ్రాండ్స్ పబ్లిసిటీ పనులు బాగానే జరుగుతున్నాయట.

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత ఇప్పుడు బాలీవుడ్‌లోనూ చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటుంద‌ట‌. చైతూతో విడాకులు తీసుకోక‌పోయి ఉంటే స‌మంత అస‌లు సినిమాలే చేసేది కాద‌ట‌. ఫ్యామిలీ ప్లానింగ్ చేయాల‌ని భావించిన ఈ ముద్దుగుమ్మ ఏవో కార‌ణాల వ‌ల్ల చైతూకి విడాకులు ఇచ్చి త‌న దారి త‌ను చూసుకుంది. కాగా, సమంత దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటూ వ‌స్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment