Bhimla Nayak : ఓటీటీ లేదు.. తొక్కా లేదు.. భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ల‌లోనే..!

October 26, 2021 7:52 PM

Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ”భీమ్లా నాయక్”. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఇందులో ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ అనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, రానా.. డానియల్ శేఖర్ అనే లోక‌ల్ డాన్‌గా క‌నిపించ‌నున్నాడు.

Bhimla Nayak will be released in Theatres said producer

భీమ్లా నాయక్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్ వచ్చిందని , ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసిందని అనేక ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించారు. “భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో జనవరి 12 న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతోందని, ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని వ‌చ్చే రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.

భీమ్లా నాయ‌క్ చిత్రం షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment