Samantha Naga Chaithanya : స‌మంత‌, చైత‌న్య కంబైన్డ్ ఫ్రెండ్స్‌.. అయోమ‌యంలో..?

October 25, 2021 6:36 PM

Samantha Naga Chaithanya : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింద‌న్న చందంగా మారింది.. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల కామ‌న్ స్నేహితుల ప‌రిస్థితి. ఆ జంట విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించడంలో ఆ ఇద్ద‌రికీ కామ‌న్‌గా ఉన్న స్నేహితుల‌కు ఏమీ పాలుపోవ‌డం లేద‌ట‌. ఎవ‌రికి సపోర్ట్ ఇస్తే ఎవ‌రు ఏమ‌నుకుంటారోన‌ని వారు సైలెంట్‌గా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

Samantha Naga Chaithanya combined friends are in dilemma state

స‌మంత‌, నాగ‌చైత‌న్య ఎన్నో సంవ‌త్స‌రాలు ప్రేమించుకుని ఆ త‌రువాత పెళ్లి చేసుకున్నారు. త‌రువాత వీరు టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవ‌రికి క‌న్నుకుట్టిందో.. ఏ దేవుడి శాప‌మో తెలియ‌దు కానీ.. ఈ ఇద్ద‌రూ విడిపోయారు. అత్యంత బాధ‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం స‌మంత వ‌రుస సినిమాల‌కు ఒప్పుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తోంది. ఇక నాగ‌చైత‌న్య కూడా వ‌రుస‌గా సినిమాల‌ను చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కామ‌న్ గా స్నేహితులు కొంద‌రు ఏర్ప‌డ్డారు. వారు స‌మంత‌కు, నాగ‌చైత‌న్య‌కు కంబైన్డ్‌గా స్నేహితులే. ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ఉన్నన్ని రోజులూ ఆ కామ‌న్ ఫ్రెండ్స్ వీరి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లేవారు. పార్టీలు చేసుకునేవారు. అయితే ఈ జంట విడిపోయాక‌.. ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ వీరికి దూరంగా ఉంటున్నార‌ట‌. ఎందుకంటే.. వారు అటు స‌మంత‌కే కాక‌, ఇటు నాగ‌చైత‌న్య‌కూ స్నేహితులే క‌దా. క‌నుక కంబైన్డ్ ఫ్రెండ్స్ కాబ‌ట్టి.. ఇద్ద‌రి నుంచీ దూరంగా ఉండాల‌ని అనుకుంటున్నార‌ట‌.

కేవ‌లం స‌మంత వ‌ద్ద‌కో లేదా నాగ‌చైత‌న్య వ‌ద్ద‌కో వెళితే.. త‌మ‌కు ఎవ‌రు కావాలో వారిని ఎంచుకున్న‌ట్లు అవుతుంది. దీంతో ఇంకొకరికి దూరం కావ‌ల్సి వ‌స్తుంది. ఇది ఇష్టం లేకే ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ ఎవ‌రి వ‌ద్ద‌కూ వెళ్ల‌డం లేద‌ట‌. కొంత కాలం పాటు వేచి చూడాల‌ని.. విడాకుల ప్ర‌క్రియ పూర్త‌య్యాక‌.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని అనుకుంటున్నార‌ట‌. దీంతో చై, సామ్‌ల కంబైన్డ్ స్నేహితులకు ప్ర‌స్తుతం ఏం చేయాలో తెలియని అయోమ‌య స్థితి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment