Tollywood : యాంక‌ర్ల మ‌ధ్య ముదిరిన గొడ‌వ‌లు..? ఇన్వాల్వ్ అయిన స్టార్ హీరో..?

October 22, 2021 9:51 PM

Tollywood quarrel between anchors.. one hero involved to calm them

Tollywood : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై యాంక‌ర్స్ హంగామా ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెర‌పై సంద‌డి చేసే యాంక‌ర్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ అందాల ఆర‌బోత‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఈ యాంక‌ర్స్ ఇప్పుడు తెలుగు సినిమాపై కూడా ప్ర‌భావం చూపిస్తున్నారు. అయితే కొంతమంది యాంకర్లు స్టార్ హీరోలతో అదే విధంగా కొంతమంది నిర్మాతలతో, ద‌ర్శ‌కుల‌తో స్నేహం ఎక్కువ‌గా చేయడం సంచ‌ల‌నం రేపుతోంది.

తెలుగు సినిమాలో కొంతమంది యాంకర్లు నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే యాంకర్ల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్య ఓ యాంకర్ ఒక సినిమాలో నటించేందుకు, అలాగే ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓ దర్శకుడితో చర్చలు జరపడం.. మరో యాంకర్ ఈ విషయంలో సీరియస్ అవడం జరిగాయని.. అంటున్నారు.

ఆ ఇద్దరు యాంకర్ల మ‌ధ్య జ‌రిగిన రచ్చ‌లో ఓ స్టార్ హీరో కూడా ఇన్వాల్ అయ్యాడ‌ట‌. అత‌ను రిక‌మెండ్ చేసినా కూడా ఆ యాంక‌ర్ అలానే ప్ర‌వ‌ర్తించింద‌ని, ఆమె అలా ప్ర‌వ‌ర్తించ‌డం క‌రెక్ట్ కాద‌ని కొంద‌రు అంటున్నారు. ఇప్పుడు ఒక సీనియర్ యాంకర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే ప్రయత్నం చేస్తుందని, అలాగే ఒక ఛానల్ యాజమాన్యం కూడా వీరిద్దరితో చర్చ జరుపుతోందని అంటున్నారు. గ‌తంలోనూ ఇలాంటి విభేదాలు టాలీవుడ్‌లో రావ‌డం మ‌నం గ‌మ‌నించాం. మరి ఇప్పుడేమవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment