Allu Family : అల్లు ఫ్యామిలీ సీక్రెట్ పాలిటిక్స్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు.. తెలివంటే వారిదే..!

October 21, 2021 7:48 PM

Allu Family : ప్రస్తుతం మా ఎన్నికల కారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలపై కూడా చాలా వరకు ప్రభావం పడింది. అయితే ఈ రాజకీయాల వల్ల ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతోపాటు నటీనటులు సైతం ఈ మా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. సాధారణ రాజకీయాల్ని తలపించిన మా ఎలక్షన్స్ కు చాలా దూరంలో నిలిచి కూల్ గా ఉంది అల్లు ఫ్యామిలీ. అలా అని తమ కుటుంబం మా ఎలక్షన్స్ కు విరుద్దం అని కాదు.. తమకు, తమ ఫ్యామిలీకి అందరూ కావాలని చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదొక టైప్ ఆఫ్ రాజకీయం అని అంటున్నారు.. సినీ ప్రముఖులు.

Allu Family secret politics very interesting to fans

ఇక మా ఎలక్సన్స్ లో ప్రకాష్ రాజ్ ను గెలిచేలా చేయడానికి మెగా కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేసిందనే విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ గానీ, అల్లు శిరిష్ లు గానీ కనీసం తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్, ఏపీ మంత్రులపై కామెంట్స్ చేస్తే.. అల్లు అరవింద్ మాత్రం జగన్ పట్ల సానుభూతిని ప్రకటించారు. నెక్ట్స్ బాలయ్యతో కలిసి అల్లు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద ఓ టాక్ షోని రన్ చేస్తున్నారు.

బాలకృష్ణకు కూడా అల్లు ఫ్యామిలీ మీద మంచి ఉద్దేశ్యమే ఉంది. ఇప్పటికే ఆహాలో మంచు లక్ష్మీతో కుకింగ్ ప్రోగ్రామ్ ని కూడా రన్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ ఫ్యామిలి అయిన అక్కినేని పరివారంతో కూడా అల్లు ఫ్యామిలీకి మంచి కనెక్షన్ ఉంది. నాగచైతన్యతో 100 % ల‌వ్ సినిమా, లేటెస్ట్ గా అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసి వారి బంధాన్ని మరింత పెంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కూడా నెక్ట్స్ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అలా అల్లు వారి ఫ్యామిలీ ఇండస్ట్రీలో అందరినీ కలుపుకుంటూ వెళ్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now