Prakash Raj : బాబోయ్.. ప్ర‌కాశ్ రాజ్‌కి ఇన్ని ఆస్తులున్నాయా..!

October 20, 2021 4:10 PM

Prakash Raj : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు. మా అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణుపై ఓటమి పాల‌య్యారు. అయితే ఈ ఓట‌మిపై ప్ర‌కాశ్ రాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికలలో పారదర్శకత లేదని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు సీసీ ఫుటేజ్ కావాలని లేఖ రాశారు ప్రకాష్ రాజ్. కానీ ఇవ్వడం కుదరదని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.

Prakash Raj has got many assets

నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ప‌లు భాష‌ల‌లో న‌టించిన ప్ర‌కాశ్ రాజ్ బాగానే సంపాదించారు. ఆయన తనకి ఫామ్‌ హౌజ్, భూములున్నాయి కానీ.. బిజినెస్‌లు లేవని స్పష్టం చేశారు. భూమి మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆయన అన్నారు.

గత సంవత్సర కాలం నుంచి షాద్‌నగర్‌లో ఉన్న ఫామ్ హౌజ్‌ను తన పిల్లలే చూసుకుంటున్నారని, ఇక తాను వర్కర్స్‌కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం గానీ, వాళ్లకి పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం గానీ తనకు లేవని ఆయన వివరించారు. దీని వ‌ల‌న 30 మందికి ఉపాధి దొరుకుతుందని, అక్కడ 20 కాటేజెస్, స్మాల్ రెస్టారెంట్స్, ఓన్ ఫుడ్, నేచర్స్ ఫుడ్, అంతే కాకుండా అక్కడ యోగా చేసుకోవడానికి కూడా తగిన సదుపాయాలు ఉన్నాయని, దాంతో పాటు రిసార్ట్స్ కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment