Trivikram Srinivas : స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి వార్నింగ్ ఇచ్చిన మ‌హేష్ బాబు అభిమాని.. ఎందుకో తెలుసా?

October 20, 2021 12:29 PM

Trivikram Srinivas : అభిమానం ముసుగులో కొంద‌రు స్టార్ హీరోల అభిమానులు వికృత చేష్ట‌లు చేస్తున్నారు. ఫోన్‌లు చేసి వార్నింగ్‌లు ఇవ్వ‌డం, ఎదుటివారిపై దాడి చేయ‌డం వంటివి కూడా చేస్తున్నారు. 2010లో మ‌హేష్ బాబు అభిమాని త్రివిక్ర‌మ్‌కి ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. దీనిని త్రివిక్ర‌మ్ కామెడీగా తీసుకున్న‌ట్టు ఆ మ‌ధ్య ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నారు త్రివిక్ర‌మ్.

Trivikram Srinivas got warning from mahesh babu  fan

2010వ సంవత్సరం లో మహేష్ తో కలిసి ఖలేజా సినిమాను నిర్మించాడు త్రివిక్ర‌మ్. అనుష్క‌, సునీల్‌, ఆలీ ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే ఈ సినిమాని మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఒక బెదిరింపు కాల్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. హీరోల ఫ్యాన్స్‌ నుండి బెదిరింపు కాల్స్ అప్ప‌టి నుండే వ‌చ్చాయ‌ని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే తాను ముందుగానే ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోలు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు చాలా ఆస‌క్తి చూపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌వ‌న్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ చిత్రం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రం మ‌హేష్ బాబు రేంజ్‌ని మ‌రింత పెంచేలా ఉంటుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment