Ali Reza : తండ్రైన అలీ రెజా.. ఏంజెల్‌కు తండ్రినంటూ ఎమోష‌న‌ల్‌..

October 20, 2021 6:55 AM

Ali Reza : ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించిన అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3 కార్య‌క్ర‌మంతో ఫుల్ పాపులారిటీ అందుకున్న విష‌యం తెలిసిందే. ఆ సీజ‌న్‌లో మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అయినా తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కప్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా అలీ రెజాకు నిరాశే ఎదురైంది. అయితే సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్ర‌క‌టించాడు.

Ali Reza become father born baby

అలీ రెజా భార్య తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు అలీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. ‘అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. పాప‌ని ఎత్తుకున్న ఫొటోని కూడా షేర్ చేశాడు. కాక‌పోతే ఆ పాప ఫేస్ క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

ఇటీవ‌ల అలీ భార్య మసుమ్‌ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్‌ కపుల్‌గా అభివర్ణించారు.

https://www.instagram.com/p/CVNVua-IVWa/?utm_source=ig_embed&ig_rid=45dfc29b-0aab-4fb0-85fa-d231d68c5136

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment