మార్కెట్లోకి వచ్చిన 50 అంగుళాల స్మార్ట్ టీవీ.. ధర ఎంత అంటే?

April 24, 2021 12:19 AM

మన దేశం లోకి కొత్తగా ఫ్రేమ్ లెస్ టీవీని దైవా అనే కంపెనీ లాంచ్ చేసింది. 56 అంగుళాల పొడవున్న ఈ టీవీని 4 కే స్మార్ట్ టీవీ D50162FL అనే పేరును పెట్టారు. మనదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్ అతిత్వరలోనే రిటైల్ షాపులలో సేల్స్ కి రానుంది. ఈ తరహా టీవీ కి కంపెనీ అంచులను బాగా తగ్గించింది ఈ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 96% ఉండటం దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు.

కొత్తగా లాంచ్ చేసిన ఈ టీవీ స్క్రీన్ రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్‌గా ఉంది. 100 కోట్ల రంగులను ఇది చూపిస్తుందని కంపెనీ పేర్కొంది. హెచ్‌డీఆర్10 ఫీచర్ కూడా ఇందులో ఉంది. 20W సౌండ్ అవుట్ పుట్‌ను అందిస్తోంది.డిస్నీప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, జీ5, వూట్ వంటి యాప్స్‌కు చెందిన కంటెంట్‌తో మూవీ బాక్స్‌ను ఇందులో అందించనున్నారు.

ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం పై ఇది పనిచేయనుంది.ఏ55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీ రిమోట్‌లో ఉన్న మైక్‌పై ప్రెస్ చేయడం ద్వారా మీరు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ 4 కే స్మార్ట్ ఫోన్ ధర కేవలం
రూ.39,990గా నిర్ణయించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment